in

NETTINTLO VIRAL GA MARINA HOT ANCHOR RASHMI!

లన చిత్ర పరిశ్రమలో రెమ్యూనరేషన్ విషయంలో పేచీలు, కాల్ షీట్స్ విషయంలో చికాకులు సర్వ సాధారణం, కొన్నిసంఘటనలు టీ కప్పులో తుఫాను లాగ సమసిపోతాయి, మరి కొన్ని పబ్లిక్ అయి సంచలన వార్తలు అవుతాయి. ఇటువంటి సంచలన సంఘటనే ఒకటి ఈ మధ్య బుల్లి తెర యాంకర్, సినిమా నటి అయినా రష్మీ విషయం లో జరిగింది. సీనియర్ నిర్మాత బాలాజీ నాగలింగం గారు రష్మీ ని ” ఫిలిం ఛాంబర్ గేట్ కి కట్టిసి కొడతా” అని తిట్టడం పెద్ద సంచలనమే అయ్యింది, నిర్మాత అంత తీవ్రమయిన స్థాయి లో రష్మిని తిట్టవల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే విషయం గ ఆయన వివరణ ఇవ్వటం జరిగింది. బుల్లి తెర మీద హాట్ యాంకర్ గ పేరున్న రష్మీ గుంటూరు టాకీస్ అనే చిత్రంలో నటించిన విషయం మనందరికీ తెలిసిన విషయమే..

ఈ చిత్రం తరువాత బాలాజీ నాగలింగం గారు నిర్మిస్తున్న ” రాణి గారి బంగ్లా” అనే చిత్రం లో నటిస్తున్నారు రష్మీ, రష్మీ అడిగిన రెమ్యూనరేషన్ కాదని, నిర్మాత చెప్పిన రెమ్యూనరేషన్ కి ఒకే చెప్పి, సినిమా షూటింగు ప్రారంభం అయిన తరువాత రెమ్యూనరేషన్ విషయంలో పేచీ పెట్టింది రష్మీ. నిర్మాత ఎంతగా చెప్పిన వినకుండా మొండికి వేసి, ఒక పాట, డబ్బింగ్ పెండింగ్ పెట్టేసారు రష్మీ. సినీ పరిశ్రమలో కొంత మంది పెద్దల పేర్లు చెప్పి నిర్మాతను బెదిరించటం మొదలు పెట్టారట రష్మీ , దీని తో సహనం కోల్పోయిన నిర్మాత రష్మిని దూషించటం జరిగింది, అని వివరణ ఇచ్చారు నిర్మాత, చివరకు నిర్మాత మాటే నెగ్గింది, రష్మీ షూటింగ్ కంప్లీట్ చేశారు, ప్రస్తుతం ఈ సంఘటన నెట్టింట్లో వైరల్ గ మారింది.

Allu Arjun meets Sanjay Leela Bhansali in Mumbai, Collab on cards?

is ‘radhe shyam’ actress pooja hegde a believer in astrology?