15 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్న ఆంటోనీని పెళ్లి చేసుకుని ఆ ఫోటోలని సోషల్ మీడియాలో పెట్టడంతో తెగ వైరల్ అయ్యాయి. అయితే పెళ్లి అయిన 15 రోజులకే ఆమెపై రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు నెటిజన్స్. ఆమె చేతిలో ఇక సినిమాలు లేవు అని, ఉన్న సినిమాలు కూడా కంప్లీట్ చేసేసిందని, ఇకపై తాను ఫ్యామిలీ లైఫ్ ని మాత్రమే ఎంజాయ్ చేయబోతుందని, కొద్దిరోజుల తర్వాత మళ్లీ నటిగా రీఎంట్రీ ఇస్తుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు..
ఈ రూమర్స్ పట్ల కీర్తి సురేష్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి. అంతే కాకుండా పెళ్లయిన వెంటనే భర్తతో హనీమూన్ కి వెళ్ళకుండా తన బాలీవుడ్ ఫస్ట్ మూవీ అయిన బేబీ జాన్ మూవీకి ప్రమోషన్స్ కి వెళుతుంది అంటూ ఆమెపై ఫైర్ అవుతున్నారు. కొందరు మాత్రం ఆమె డెడికేషన్ కి ఫిదా అవుతున్నారు. బాలీవుడ్ సినిమా కావటంతో అందుకు తగ్గ అవుట్ ఫిట్స్ వేసుకున్నప్పటికీ సౌత్ ఇండియన్ సాంప్రదాయం ప్రకారం మెడలో తాళిబొట్టు వేసుకొని వెళ్లడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు..!!