
ఈ ఛాలెంజ్.. ఆ ఛాలెంజ్ అంటూ రోజుకొక ఛాలెంజ్ పేరిట సోషల్ మీడియా లో ఏదోకటి పోస్ట్ చేస్తున్నారు మన సెలెబ్రిటీలు. హీరోయిన్స్ అయితే ఇంకా ఎక్సట్రాగా చేస్తున్నారు అనే చెప్పాలి. అందులో పాయల్ రాజపుట్ ఇంకా తమన్నా ముందు వరసలో ఉన్నారు.. పాయల్ పిల్లో ఛాలెంజ్, పేపర్ ఛాలెంజ్ అంటూ తెగ అందాలు ఆరబోస్తుంది.. ఆమెను చూసి మిల్కీ బ్యూటీ తమన్నా కూడా పిల్లో ఛాలెంజ్ చేసింది..ఇవి కొందరిని ఆకట్టుకున్న మరికొందరికి తెగ ఆగ్రహం తెప్పిస్తున్నాయి. వీటి వాళ్ళ ఇలాంటి కష్ట సమయంలో అసలు ఏమన్నా ఉపయోగం ఉందా అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. పేద వాళ్లకు, లేదా ఆపద లో ఉన్న వాళ్లకు ఏదొక సహాయం చేసేది పొయ్యి ఈ పనికి మాలిన ఛాలెంజెస్ ఏంటి అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.. అసలే ఇండస్ట్రీలో హీరోయిన్స్ కు ఈ మధ్య విపరీతమైన పోటీ ఉంది.. లాక్ డౌన్ ఎత్తేశాక ప్రొడ్యూసర్స్ కు మేము గుర్తుంటామో లేదో..ఎంతకైనా మంచిది ఇలాంటివి చేసి వార్తల్లో ఉండాలని భావిస్తున్నారు మన హీరోయిన్స్..సినిమా అవకాశాల విషయం పక్కన పెడితే ఈ ఛాలెంజెస్ వాళ్ళ పైసా ఉపయోగం ఎవరికి లేదన్న మాట వాస్తవం.. మీరు ఏమంటారు మరి.
					
					
