హాలీవుడ్ చిత్రంలో నటించే అవకాశం తప్పిపోయినందుకు ఎంతో మనస్తాపం చెందిన మెగా స్టార్. ఇప్పటి సంగతి కాదు 1999 లో ముగ్గురు విదేశీ భారతీయులు 1940 లో వచ్చిన “థీఫ్ అఫ్ బాగ్దాద్ “అనే చిత్రాన్ని ఇంగ్లీష్, తెలుగు భాషల్లో పునర్నిర్మించాలి అనుకున్నారు. చిరంజీవి గారి కి తమ ప్రయత్నం గురించి చెప్పగానే చిరంజీవి గారు ఒకే చేసారు. ఆ చిత్రం ఇంగ్లీష్ వెర్షన్ కి ” ది రిటర్న్ అఫ్ థీఫ్ అఫ్ బాగ్దాద్” అని, తెలుగు వెర్షన్ కి ” అబూ బాగ్దాద్ గజదొంగ” అని నామకరణం చేసారు, ఇంగ్లీష్ వెర్షన్ కి హాలీవుడ్ డైరెక్టర్, తెలుగు వెర్షన్ కి సురేష్ కృష్ణ డైరెక్టర్ గ నిర్ణయించారు. ఆ రోజుల్లోనే 50 కోట్ల భారీ బడ్జెట్ తో రామోజీ ఫిలిం సిటీ లో 1999 అక్టోబర్ 4 తారీఖున షూటింగ్ ప్రారంభించారు.
తరువాతి షెడ్యూల్ రాజస్థాన్ ఎడారి లో కొనసాగించారు.మత పరమయిన అంశాల మీద సరి అయినా అవగాహన లేక పోవడం తో రెండు మతాల వారి ఆగ్రహానికి గురి అయ్యారు. ఒకవైపు సౌదీ ప్రభుత్వం, ఇంకో వైపు భారతీయ ప్రభుత్వం అభ్యంతరాలు తెలపటం తో షెడ్యూల్ ఆగిపోయింది, సమస్య పరిష్కరించుకొని షూటింగ్ పునః ప్రారంభించటం లో నిర్మాతలు విఫలం అయ్యారు. మతపరమయిన కారణం తో ఆగిన షూటింగ్ తిరిగి ప్రారంభం కాలేదు ఆ విధం గ ఒక గొప్ప చిత్రం ప్రేక్షకులు మిస్ అయితే, చిరంజీవి గారు హాలీవుడ్ చిత్రం మిస్ అయ్యారు.చిరంజీవి గారి కల, కలగానే మిగిలిపోయింది.