ప్రభాస్ పేరు మీద ఒక ఊరు ఎక్కడుందో తెలుసా?
ప్రభాస్ పేరుతో ఒక గ్రామం ఉందనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఒక గ్రామానికి ప్రభాస్ పేరు ఉండటం, అది కూడా భారతదేశంలో కాకుండా పొరుగు దేశం అయిన నేపాల్‌లో ఉండటం విశేషంగా మారింది. ఒక తెలుగు మోటో బ్లాగర్ నేపాల్‌లో పర్యటిస్తుండగా, ఒక ఊరి పేరు ప్రభాస్ అని ఉండటాన్ని గమనించాడు. దీంతో అతను వెంటనే ప్రభాస్ పేరుతో ఉన్న గ్రామ బోర్డు కనిపించేలా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు..
నేపాల్ లో రెబెల్ స్టార్ ప్రభాస్ పేరు మీద ఉన్న ఊరు
తాను నేపాల్‌లో ప్రభాస్ అనే ఊరిలో ఉన్నానని, మన తెలుగు వారికి ప్రభాస్ అనే పేరు వినగానే ఒక వైబ్ వస్తుందని, మీరు ఎప్పుడైనా ప్రభాస్ అనే పేరుతో ఉన్న గ్రామాన్ని చూశారా? అంటూ ఆ వీడియోలో ప్రశ్నించాడు. అయితే ఆ గ్రామానికి ప్రభాస్ అనే పేరు ఎందుకు వచ్చింది? దాని వెనుక కథ ఏమిటి? అన్నవి మాత్రం తెలియరాలేదు. అయితే ప్రభాస్ అభిమానులు మాత్రం తమ అభిమాన నటుడి పేరుతో ఒక గ్రామం ఉండటంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు..!!