
టిల్లు స్క్వేర్’లో నేహా శెట్టి సర్‌ప్రైజ్ క్యామియో చేసింది. ఈ సినిమా 100 కోట్లు వసూలు చేసి బ్లాక్‌బస్టర్ అయినా, నేహాకు ఆ సక్సెస్ పెద్దగా ఉపయోగపడలేదు. రాధిక పాత్రతో ఆమె ఇమేజ్ ఫిక్స్ అయిపోవడంతో వైవిధ్యమైన రోల్స్ దక్కడం కష్టమైంది. స్పెషల్ సాంగ్స్ చేయడానికి కూడా నేహా రెడీగా ఉన్నా, అలాంటి ఆఫర్లు రావడం లేదు. ఇప్పుడు ఆమె టిల్లు సీక్వెల్ ‘టిల్లు క్యూబ్’ కోసం ఎదురుచూస్తోందని టాక్. ఈ సినిమాలో రాధిక పాత్ర కొనసాగితే, నేహాకు మళ్లీ క్రేజ్ వచ్చే అవకాశం ఉంది..

