రాజా రాణి’, ‘అంటే సుందరానికీ’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన ప్రముఖ నటి నజ్రియా నజీమ్. గత కొంతకాలంగా సోషల్ మీడియాకు మరియు ఇతర కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీనిపై రకరకాల ఊహాగానాలు వెలువడిన నేపథ్యంలో, నజ్రియా తాజాగా ఒక భావోద్వేగ పోస్ట్ ద్వారా తన మౌనానికి గల కారణాన్ని స్వయంగా వెల్లడించారు. తాను మానసికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, అందుకే ఈ విరామం తీసుకున్నానని ఆమె స్పష్టం చేశారు..
గతేడాది ‘సూక్ష్మ దర్శిని’ (మలయాళ చిత్రం) షూటింగ్ పూర్తయినప్పటి నుంచి నజ్రియా సోషల్ మీడియాలో గానీ, బయట కార్యక్రమాల్లో గానీ పెద్దగా కనిపించలేదు. దీంతో ఆమె వ్యక్తిగత జీవితంపై పలు వదంతులు మొదలయ్యాయి. ఈ క్రమంలో, నజ్రియా తన అభిమానులను, శ్రేయోభిలాషులను ఉద్దేశిస్తూ ఒక సుదీర్ఘమైన నోట్‌ను విడుదల చేశారు. “నేను కొంతకాలంగా అందరికీ దూరంగా ఉంటున్నాను. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేను” అని ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు..!!