in

nayanthara to romance bollywood megastar!

ల్మాన్ ఖాన్ సరసన నయనతార నటించబోతుందనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ క్రేజీ కాంబినేషన్‌ను వెండితెరపైకి తీసుకువచ్చే బాధ్యతను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తీసుకోబోతున్నట్లు టాక్. ‘మహర్షి’, ‘వారసుడు’ వంటి క్లాస్ మరియు మాస్ హిట్లను అందించిన వంశీ, సల్మాన్ కోసం ఒక పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ సిద్ధం చేశారని, అందులో హీరోయిన్ పాత్రకు నయనతార అయితేనే న్యాయం జరుగుతుందని భావిస్తున్నారట. ఈ వార్త గనుక నిజమైతే, ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇదొక బిగ్గెస్ట్ కొలాబరేషన్ అవుతుంది..

నయనతార తన సెకండ్ ఇన్నింగ్స్‌లో చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ, నార్త్ టూ సౌత్ తన మార్కెట్‌ను విస్తరిస్తోంది. సల్మాన్ ఖాన్ లాంటి మాస్ హీరో పక్కన నయనతార లాంటి పర్‌ఫార్మర్ తోడైతే, ఆ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం. అయితే, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి చిత్ర యూనిట్ లేదా మేకర్స్ నుండి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాపై క్లారిటీ వస్తే, సల్మాన్ అభిమానులకు మరియు నయనతార ఫ్యాన్స్‌కు ఇది అతిపెద్ద పండగ లాంటి వార్త అవుతుంది..!!

The title reveal of Allu Arjun and Atlee’s film on this day!

music director Kaala Bhairava and kavya Kalyan ram to get married!