
ఒకప్పుడు కొరియోగ్రాఫర్ ,డైరెక్టర్ ప్రభుదేవాతో చెట్టాపట్టాలేసుకు తిరిగి పెళ్ళికి రెడీ అయ్యాక బెడిసి కొట్టింది. కొన్ని సంవత్సరాల క్రితం ప్రభుదేవా నయనతార ప్రేమించుకున్నారు.అయితే అసలు విషయం లోకి వెళ్తే, వీరిద్దరి కాంబోలో ఒక సినిమాకు తమిళ ప్రముఖ నిర్మాత ప్లాన్ చేస్తున్నాడు. ప్రభుదేవా దర్శకత్వంలో నయనతార హీరోయిన్ గా కార్తి హీరోగా సినిమా రూపొందబోతున్నట్లుగా తమిళ మీడియాలో ప్రముఖంగా కథనాలు వస్తున్నాయి. ఈ కాంబో కనుక నిజంగానే వస్తే ఖచ్చితంగా సినిమా సెన్షేషన్ అవ్వడం ఖాయం. ఇలాంటి సమయంలో మళ్లీ ప్రభుదేవాతో మూవీ అవసరమా అంటూ చాలా మంది అనవచ్చు. కాని నయనతారకు కథ నచ్చడంతో ఆయన దర్శకత్వంలో నటించేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.
 
					 
					
