టాలీవుడ్‌లో చాలా మంది స్టార్ హీరోలతో నటించినా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో మాత్రం ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ సినిమా అవకాశం వచ్చి కూడా నయన్ స్వయంగా రిజెక్ట్ చేసింది. పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా వచ్చిన ‘వకీల్ సాబ్’ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే..
ఈ సినిమాకి ముందు, డైరెక్టర్ మొదట నాయిక పాత్రకు నయనతారను ఎంపిక చేశారు. కానీ స్క్రిప్ట్‌లో ఆ పాత్రకు చాలా తక్కువ ప్రాధాన్యం ఉండటంతో, ఆమె ఆ ప్రాజెక్ట్ నుంచి వెనక్కి తగ్గిందని ఇండస్ట్రీలో టాక్. వకీల్‌సాబ్ సినిమాలో పవన్‌కు భార్యగా శృతీహాసన్ నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో పాత్ర కీలకమే అయినా నిడివి తక్కువగా ఉంటుంది..!!