తాజాగా, నయనతారను మెగాస్టార్ చిరంజీవి సినిమాకు హీరోయిన్‌గా తీసుకునేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నయన్ నటించే అవకాశం ఉందని టాక్. గతంలో చిరంజీవితో ‘సైరా’, ‘గాడ్ ఫాదర్’ సినిమాల్లో నటించిన నయన్, ఈ సినిమాకు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందట..
సినిమాకు రూ.18 కోట్ల వరకు అడుగుతూ, రెమ్యునరేషన్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్‌కూ ఒప్పానంటోంది. నయనతార ఈ సినిమాలో ఉంటే బజ్ బాగా వస్తుందని, తెలుగు, తమిళ రాష్ట్రాల్లో సినిమాకు మంచి ఓపెనింగ్స్ దక్కుతాయని నిర్మాతలు భావిస్తున్నారు. అనిల్ రావిపూడి గత సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సంక్రాంతికి రూ.300 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ క్రేజ్‌తో చిరంజీవి, నయన్ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసే అవకాశం ఉంది. ఈ సినిమాను 2026 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు..!!