దసరా లాంటి మాస్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఒదేల దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు. ఈ మూవీలో నానికి జోడిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ద కపూర్ నటిస్తోంది. వీటి తరవాత శేఖర్ కమ్ములతో ఓ మూవీ చేయనున్నట్లు టాక్. హ్యాట్రిక్ హిట్స్, వరుస ఆఫర్స్ తో జోరు మీదున్న నాని తన మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని పేమెంట్ కూడా పెంచినట్లు తెలుస్తోంది.
ఇంతకు ముందు ఒక లెక్క ఇప్పుడొక లెక్క. ఇప్పుడు నాని రేంజ్ పెరిగింది. నాని సినిమాలకి పెట్టిన బడ్జెట్ ఎప్పుడు లాస్ అవలేదు. అందుకే నిర్మాతల హీరోగా నాని గుర్తింపు పొందాడు. దసరా మూవీతో పాన్ ఇండియా హిట్ కొట్టాడు. మార్కెట్ కూడా పెరిగింది. సరిపోదా శనివారం మూవీ 100 కోట్ల క్లబ్ లో చేరింది. దీనితో నాని తన పేమెంట్ ని అమాంతం పెంచేసాడు. ‘హిట్ 3’ తర్వాత చేసే సినిమాలకి 35 కోట్ల పేమెంట్ తీసుకోనున్నట్లు సమాచారం. టైర్ టు హీరోలలో రెమ్యూనరేషన్ లో టాప్ లో ఉన్నాడు నాని..!!