in

nara rohith wife sireesha in pawan kalyan’s OG’!

వర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా, యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ యాక్షన్ చిత్రం ‘ఓజీ’ గురించి ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో నటుడు నారా రోహిత్ కాబోయే భార్య శిరీష నటిస్తున్నారన్న వార్త కొంతకాలంగా ప్రచారంలో ఉండగా, ఇప్పుడు ఈ విషయాన్ని నారా రోహిత్ స్వయంగా ధ్రువీకరించారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్‌తో కలిసి నటించిన ‘భైరవం’ సినిమా ప్రచార కార్యక్రమాల్లో నారా రోహిత్ చురుగ్గా పాల్గొంటున్నారు..

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సాయి ధరమ్ తేజ్‌తో కలిసి చిత్ర బృందం ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ‘ఓజీ’ సినిమా గురించి ఏదైనా తాజా సమాచారం పంచుకోవాలని సాయి ధరమ్ తేజ్ కోరగా, దీనికి సమాధానంగా నారా రోహిత్ “‘ఓజీ’లో నాకు కాబోయే భార్య శిరీష నటించింది. ఈ సినిమాలో తనకు ఒక కీలకమైన పాత్ర పోషించే అవకాశం దక్కింది” అని తెలిపారు. ఈ ప్రకటనతో శిరీష ‘ఓజీ’లో నటిస్తున్నారన్న వార్తలకు అధికారిక ముద్ర పడినట్లయింది..!!

Nandini Rai sensational comments on varasudu movie!