నటనకు భాష, ప్రాంతం ఇటువంటి ప్రతిబంధకాలు , ఎల్లలు ఏమి ఉండవు. నిజమయిన నటన హృదయాన్ని స్పృశించినప్పుడు భాషలు, ప్రాంతాలు ఇవేమి అడ్డంకి కావు. అటువంటి అరుదయిన సంఘటన ఒకటి ఈ మధ్యనే జరిగింది. ఆస్ట్రేలియా కు చెందిన క్రికెట్ జర్నలిస్ట్ అయిన క్లొయ్ అమందా బెయిలీ, మన నాచురల్ స్టార్ నాని నటించిన “జెర్సీ” సినిమా చూడటం జరిగింది. ఒక క్రికెటర్, క్రికెట్ కి దూరం అవటం, దానికి కారణం తన భార్య కు బిడ్డకు కూడా వెల్లడించలేని నిస్సహాయ పరిస్థితిని ఎదుర్కొనే అభాగ్యుడిగా నాని నటన ఆమె హృదయాన్ని స్పృశించింది.
నాని నటనకు ఫిదా అయిన క్లొయ్ అమందా బెయిలీ ప్రశంసల వర్షము కురిపించటమే కాకా, అందులోని రైల్వే స్టేషన్ సీన్ చూసి ఎంతో ఎమోషన్ కి గురి అయ్యాను అని పేర్కొంది. నాని రైల్వే స్టేషన్ లో ఫ్లాట్ ఫారం మీద నిలబడి, ట్రైన్ వెళుతున్న శబ్దంలో, ఎవరికి వినిపించకుండా పెద్దగా అరుస్తూ తనలోని ఫ్రస్ట్రేషన్ వెళ్లగక్కిన సీన్ కి సంబంధించిన వీడియో షేర్ చేస్తూ, బెయిలీ, జెర్సీ సినిమా ఒక అద్భుతమయిన భావోద్వేగ పూరిత ప్రయాణం, ఈ సినిమా లో ఒక క్రికెటర్ గ నాని నటన అద్భుతం అంటూ ప్రశంసించటం విశేషం..