తాజాగా హీరోయిన్ నందిని రాయ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ వారసుడు సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. విజయ్ సర్ వారసుడు సినిమాలో నాది చిన్న రోల్ కాదు. నాకు నేరేషన్ ఇచ్చినప్పుడు ప్రకాష్ రాజు కూతురు పాత్ర, శ్రీకాంత్ ని రెచ్చగొట్టి ఫ్యామిలీని డివైడ్ చేయాలి. అవన్నీ షూటింగ్ కూడా చేసారు. అది ఒక మంచి క్యామియో పాత్ర. కానీ ఎడిటింగ్ లో చాలా సీన్స్ తీసేసారు. సినిమాలో 2 నిముషాలు కూడా లేదు నా పాత్ర..
సినిమా రిలీజ్ అయ్యాక ఎందుకు ఆ సినిమా చేసావు అని ప్రశ్నలు వచ్చాయి. నేను ఏం చేయలేను. ఆ సినిమా చేసినందుకు బాధపడ్డాను. నా పోస్టర్ కూడా సపరేట్ గా రిలిజ్ చేసారు. దాంతో పెద్ద పాత్ర అనుకున్నాను. కానీ నేను ఊహించలేదు. ఆ సినిమా వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చింది. వారసుడు లాంటి పాత్రలు మళ్ళీ చేయను అని చెప్పుకొచ్చింది నందిని రాయ్. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!