మోక్షజ్ఞ మొదటి సినిమా ఇంకా ప్రారంభం కాకముందే ఇంకో సినిమా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథా చర్చలు ముగిసాయాని, మోక్షజ్ఞ నెక్స్ట్ మూవీకి సైన్ చేసేసినట్లు తెలుస్తోంది. లక్కీ భాస్కర్ మూవీతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో మోక్షజ్ఞ సెకండ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. బాలయ్యతో ‘డాకు మహారాజు’ నిర్మించిన సితార ఎంటర్టైన్ మెంట్ ఇప్పుడు మోక్షజ్ఞ మూవీకి కూడా రెడీ అవుతోంది.