
బాలకృష్ణ చివరిగా బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అఖండ 2 తాండవంతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఇక ప్రజెంట్ బాలయ్య నెక్స్ట్ ప్రాజెక్ట్‌ల విషయంలో ఆడియన్స్‌లో సందేహాలు మొదలయ్యాయి. డైరెక్టర్ల లైనప్ గురించి.. ఇంట్రెస్టింగ్ టాక్ వైరల్ గా మారుతుంది. ఇప్పటికే బాలయ్య, గోపిచంద్ మల్ఇనేనితో తను నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్బికె 111 రన్నింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది..
ఈ సినిమాలో హీరోయిన్గా నయనతార నటించనుంది. ఇక తాజాగా బాలయ్యకు సంబంధించిన మరొ క్రేజి అప్డేట్ ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. టాలీవుడ్ అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం..ఎన్బికే 111 తర్వాత..కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడట. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు గాని..నిజంగానే కొరటాల, బాలయ్య కాంబినేషన్ ఫిక్స్ అయితే మాత్రం కచ్చితంగా అది సెట్స్‌పైకి రాకముందే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతుంది..!!
