in

nagarjuna serious about trolling his daughter-in-law samantha!

ఫ్యామిలీ మ్యాన్ 2’ ట్రైలర్ చూస్తే ఎవరికైనా సమంత పాత్ర ఏంటో తెలిసిపోతుంది. అయితే, మొత్తంగా మనం ఊహించుకున్నదే కరెక్టా అంటే… అలా ఉండకపోవచ్చు! డైరెక్టర్స్ అండ్ రైటర్స్ షోలో ఎలాంటి ట్విస్ట్ ఇస్తారో మనకు తెలియదు. కానీ, ఇప్పటికైతే నెటిజన్స్ కు…మరీ ముఖ్యంగా, తమిళ జనాలకు సమంత ఓ టెర్రరిస్ట్ గా అనిపిస్తోంది. అంతే కాదు, ఆమె తమిళ డైలాగ్స్ చెబుతుండటంతో పాకిస్తాన్ తో చేతులు కలిపిన చెన్నై అమ్మాయి అనుకుంటున్నారు. అదే ట్రోలింగ్ కారణం అవుతోంది. ఆమె పాత్రపై సొషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.

సమంత వెరీ ఫస్ట్ వెబ్ సిరీస్ తోనే వివాదాస్పదం కావటం నాగ్ కు నచ్చలేదట. అసలు సిరీస్ లో ఏముందో తెలియకుండా ట్రోలింగ్ చేస్తున్న వారిపై ఆగ్రహంగా ఉన్నాడట. కాకపోతే, ఇప్పటికిప్పుడు అస్సలు స్పందించ వద్దని అమేజాన్ ప్రైమ్ , ‘ ద ఫ్యామిలీ మ్యాన్’ షో మేకర్స్ రిక్వెస్ట్ చేశారట. సమంతని కూడా వారు అదే అభ్యర్థించారట. ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ విడుదల తరువాత అన్ని సందేహాలు, దుష్ప్రచారాలకు బ్రేక్ పడుతుందని దర్శకనిర్మాతలు చెబుతున్నారట. చూడాలి మరి, కోడలి ట్రోలింగ్ తో టెన్షన్ లో ఉన్న నాగార్జున రిలీజ్ దాకా ఒత్తిడిని ఎలా తట్టుకుంటారో..

Pen Studios gives clarity of global film RRR’s digital and satellite rights!

daughter’s challenge, Vishnu Manchu has gone for a clean shave!