బ్రహ్మాస్త్ర 5 వేల ఏళ్ల కిందటి నేపథ్యంలో సాగే సినిమా అని నాగ్ చెప్పడం విశేషం. ఎంత పీరియడ్ మూవీ అయినా సరే.. కొన్ని వందల ఏళ్ల వెనుకటి నేపథ్యాన్ని తీసుకుంటూ ఉంటారు దర్శకులు. కానీ ఏకంగా 5 వేల ఏళ్ల కిందటి బ్యాక్ డ్రాప్ అంటే ప్రేక్షకులను దర్శకుడు అయాన్ ముఖర్జీ ఓ కొత్త లోకంలోకి తీసుకెళ్లబోతున్నట్లే. తనకు బేసిగ్గా మైథాలజీ జానర్ అంటే చాలా ఇష్టమని. రామాయణం, మహాభారతం లాంటి కథలపై అమితాసక్తి ఉందని..
ఈ నేపథ్యంలోనే ‘బ్రహ్మాస్త్ర’ లాంటి లార్జర్ దన్ లైఫ్ సినిమాలో నటించడానికి ముందుకొచ్చానని నాగ్ తెలిపాడు. నిడివితో సంబంధం లేకుండా ఈ సినిమాలో తన పాత్ర కీలకంగా ఉంటుందని నాగ్ ఇంతకుముందే చెప్పాడు. ఇక రణబీర్, ఆలియాలతో కలిసి పని చేయడం గురించి మాట్లాడుతూ.. వాళ్లిద్దరూ చాలా మంచి నటులని, అలాగే ఇద్దరిలోనూ మంచి ఎనర్జీ ఉంటుందని, సెట్స్‌లో అలాంటి వ్యక్తులు ఉంటే తాను మరింత ఉత్సాహంగా పని చేస్తానని నాగ్ అన్నాడు.