టిఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను దేశంలో ఉన్న సెలబ్రిటీలు అందరూ స్వీకరిస్తున్నారు. అయితే తాజాగా బిగ్ బాస్ షో లో ప్రత్యేక అతిథిగా ఎంపీపీ సంతోష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి ఆయన మాట్లాడారు. ఈ చాలెంజ్ ప్రారంభమై మూడు సంవత్సరాలు పూర్తయింది అన్న ఆయన బిగ్ బాస్ హౌస్ లో నాటమని పోస్ట్ నాగార్జునకు ఒక మొక్క ను సహకరించడం గమనార్హం.
గడిచిన మూడేళ్లలో 16 కోట్ల మొక్కలు నాటడం అన్న ఎంపీ సంతోష్ కుమార్ ఈ చాలెంజ్లో సెలబ్రిటీలు సైతం ముందుకు వచ్చి అడవులను తీసుకున్నారని గుర్తు చేశారు. హీరో ప్రభాస్ పదహారు వందల యాభై ఎకరాలు దత్తత తీసుకొని దాన్ని హరిత వనం గా మార్చేందుకు సిద్ధపడ్డారని పేర్కొన్నారు. తాజాగా నాగార్జున కూడా ఒక అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటానని ముందుకు రావడం విశేషమని చెప్పారు. ఎంపీ సంతోష్ కుమార్ ఎక్కడ చూపిస్తే అక్కడ వెయ్యి ఎకరాలు దత్తత తీసుకొని మొక్కలు పెంచేందుకు నాగార్జున సిద్ధమైనట్లు సమాచారం అందుతోంది.