నాగ చైతన్య పేరు వెనుక రహస్యం, నాగార్జున గారు తాను నటించిన ఒక క్యారెక్టర్ పేరు పట్ల విపరీతంగా ఆకర్షితులు అయి తన పెద్ద కుమారుడు కి ఆ పేరు పెట్టుకున్నారట. కొమ్మనపల్లి గణపతి రావు గారి నావల్ ” అరణ్య కాండ” అదే పేరుతో సినిమాగా నిర్మించారు, క్రాంతి కుమార్ డైరెక్షన్లో. అందులో హీరో గ నటించిన నాగార్జున గారు, ఆ క్యారెక్టర్ పేరు “చైతన్య ” ఆ పేరులో ఉన్న పాజిటివ్ వైబ్రేషన్ గురించి గణపతి రావు గారితో అన్నారట,
నాకు కొడుకు పుడితే ఈ పేరే పెడతాను అని చెప్పారట. ఆ పేరు అయన మనసు లో ఆలా ముద్ర పడిపోయింది, ఆ సినిమా పూర్తి అయి డిసెంబర్ 29 వ తారీకు 1986 లో రిలీజ్ అయింది,” చైతన్య” అనే పేరు విపరీతంగా నచ్చిన నాగార్జున గారు, దానికి ముందే నవంబర్ 23 వ తేదీ 1986 న జన్మించిన తన కుమారుడికి తాను అనుకున్నట్లుగానే, కొమ్మనపల్లి గారితో అన్నట్లు గానే ” నాగ చైతన్య ” అని పేరు పెట్టటం జరిగింది. అరణ్య కాండ చిత్రం అవేరేజ్ గ ఆడింది, కానీ ఒక స్టార్ సన్ కు, ఫ్యూచర్ స్టార్ కు పేరు పెట్టడానికి కారణం అయింది.