తండెల్’ సినిమా ప్రమోషన్స్ కోసం టీమ్ అంతా ఎంతో కష్టపడ్డ సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే.. నాగచైతన్య..సాయి పల్లవిని ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూలో భాగంగా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలను చైతు..పల్లవి పై సందించారు. యాక్టింగ్ కాకుండా సాయి పల్లవికి మరేదైనా ఫ్యాషన్ ఉందా అని అడగగానే..సాయి పల్లవి తనకు తేనెటీగల పెంపకం అంటే ఇష్టమని రీసెంట్ గా దాన్ని ప్రారంభించానంటూ చెప్పుకొచ్చింది..
వెంటనే చైతన్య.. పల్లవికి బన్ మాస్క్, కొబ్బరినీళ్లు అంటే కూడా ఇష్టమని..అన్నిటికంటే నిద్రంటే బాగా ఇష్టమంటే చెప్పుకొచ్చాడు. రాత్రి 9 అయితే ఎక్కడున్నా నిద్రపోతుందని ఆయన కామెంట్స్ చేశాడు. సాయి పల్లవి డైరెక్షన్లో సినిమా ఎప్పుడు వస్తుందని అడగ్గా..నాకు అసలు ఆలోచన లేదు చేయనని సాయి పల్లవి చెప్పేసింది. అందుకు నాగచైతన్య లేదు..నువ్వు అబద్దాలు చెప్తున్నావ్ ఎప్పటికైనా సినిమా తీస్తా..అందులో నన్ను యాక్టర్‌గా తీసుకుంటానని కూడా చెప్పావని నాగచైతన్య కామెంట్స్ చేశాడు..!!