సినీరంగంలో నటీమణులకు గుర్తింపు రావడానికి చాలా సమయమే పడుతుంది. అదే కొందరు నటీమణులు మాత్రం ఒకటీ రెండు సినిమాలతోనే స్టార్ స్టేటస్‌ను సంపాదించుకుంటారు. అలా ఓవర్ నైట్ స్టార్ అయిన కథానాయిక రష్మిక మందన్న. కన్నడలో ‘కిరిక్ పార్టీ’ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ప్రస్తుతం సౌత్ టూ నార్త్ వరకు స్టార్ హీరోలందరితో కలిసి నటిస్తుంది. ఇక ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు ఏమాత్రం తగ్గకుండా ఉంది. ప్రస్తుతం ఈమె చేతిలో ఐదు సినిమాలున్నాయి. అందులో రెండు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉండగా మరో మూడు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా రష్మిక మరో సినిమాకు సైన్ చేసినట్లు తెలుస్తుంది..
నాగచైతన్య ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈయన ‘ధూత’ అనే హార్రర్ వెబ్ సిరీస్‌ను చేస్తున్నాడు. దీని తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో ద్విభాష చిత్రాన్ని చేస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభంకానుంది. ఇవి సెట్స్‌పైన ఉండగానే పరుశురామ్ పెట్లతో సినిమా చేయడానికి ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. లవ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. కాగా ఈ చిత్రంలో నాగచైతన్యకు జోడీగా రష్మికను మేకర్స్ సంప్రదించారట. కథ నచ్చడంతో రష్మిక కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. త్వరలోనే దీనిపై అధికారకంగా ప్రకటన రానుంది.