
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో దర్శకుడిగా తన మార్క్ చూపించుకొన్నాడు తరుణ్ భాస్కర్. ఆ తరవాత నటుడిగా బిజీ అయ్యాడు. వరుస సినిమాలతో హోరెత్తిస్తున్నాడు. ఇటీవలే ‘ఓం శాంతి శాంతి శాంతి’ రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ‘గాయపడ్డ సింహం’ విడుదలకు సిద్ధమైంది. మరోవైపు దర్శకుడిగానూ బిజీ అయిపోయాడు. ‘ఈ నగరానికి ఏమైంది 2’ని పట్టాలెక్కించాడు. షూటింగ్ శర వేగంగా సాగుతోంది..
‘పెళ్లి చూపులు 2’ ఐడియా కూడా ఉంది. అయితే విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తాడా, లేదంటే మరో కొత్త హీరోని తెరపైకి తీసుకొస్తాడా? అనేది వేచి చూడాలి. ఈలోగా నాగ చైతన్య కోసం చైతూ ఓ కథ సిద్ధం చేశారని టాక్. చైతూకి కూడా ఈ కథ బాగా నచ్చిందని, వీలైనంత త్వరగా ఈ సినిమాని పట్టాలెక్కించాలని చూస్తున్నారని సమాచారం. ‘ఈ నగరానికి ఏమైంది 2’ తరవాత తరుణ్ డైరెక్ట్ చేసే సినిమా ఇదే కావొచ్చు..!!
