in

naga chaitanya, Sekhar Kammula are set to team up once again!

నాగ చైతన్య 24వ సినిమా ‘వృష కర్మ’ గ్లింప్స్ ఇటీవల విడుదల అయ్యింది. అది హాలీవుడ్ స్థాయిలో ఉంది అంటూ ప్రశంసలు వచ్చాయి. ఆ సినిమా తర్వాత చైతన్య ఎవరి దర్శకత్వంలో సినిమా చేస్తారు? అనేది క్వశ్చన్. ఎందుకంటే..’వృష కర్మ’ తర్వాత సినిమా నాగ చైతన్యకు 25వ సినిమా అవుతుంది. మొన్నటి వరకు ఓ దర్శకుడి పేరు వార్తల్లో వినిపించగా.. ఇప్పుడు మరొకరి పేరు వచ్చింది..సెన్సిబుల్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ములతో అక్కినేని నాగ చైతన్య ఓ సినిమా చేశారు. అది ‘లవ్ స్టోరీ’..

అందులో సాయి పల్లవి ఉన్నప్పటికీ..నటుడిగా నాగ చైతన్య మంచి మార్కులు స్కోర్ చేశారు. ఇప్పుడు మరోసారి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేసేందుకు నాగ చైతన్య రెడీ అవుతున్నారని తెలిసింది. మొన్నటి వరకు ‘బెదురు లంక 2012’ ఫేమ్ క్లాక్స్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు నాగ చైతన్య ఓకే చెప్పారని వినిపించింది. అది చైతన్య 25వ సినిమా అవుతుందని వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు శేఖర్ కమ్ములతో 25వ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారట..!!

Nani To Collaborate With Venky Atluri For Next?

Vijay Sethupathi: All my produced films are huge losses for me