కుర్ర హీరోలు ఎందరు వచ్చినా నాగార్జున ఆరు పదుల వయసులో కూడా నాగ్ చాలా ఫిట్‌గా ఉంటూ అందరినీ ఆశ్యపరుస్తున్నారు. అయితే నాగ్ తాజాగా చేయనున్న సినిమా బంగార్రాజు. ఈ సినిమా అప్పట్లో బంపర్ హిట్ అందుకున్న సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కనుంది. ఈ సీక్వెల్ గురించి గత రెండేళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు ఈ సినిమా పట్టాలెక్కేందుకు సిద్దమయింది. అంతేకాకుండా ఈ సినిమా మల్టీస్టారర్‌గా తెరకెక్కనుందన్న విషయం కూడా తెలిసిందే.
ఇందులో నాగ్ తనయుడు నాగచైతన్య ఓ పాత్ర చేస్తానడంతో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ నాగచైతన్యకు తగ్గట్టుగా ఓ పాత్రని రెడీ చేశారు. అయితే ఈ సినిమా మొదలు అయ్యే సమయానికి చైతు తన సినిమాలతో బిజీగా ఉండటంతో బంగార్రాజు చేయలేనని అన్నారు. కావాలంటే కాస్త వెయిట్ చేయమని అన్నారంట. అయితే బంగార్రాజు సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నాగ్ అనుకుంటున్నారు. దాంతో సినిమాను ఇప్పుడు మొదలు చేస్తే గాని అప్పటికి పూర్తి కాదని, నాగచైతన్య పాత్రలో వేరొకరిని తీసుకునేందుకు చూస్తున్నారంట. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.