మణిరత్నం డైరెక్షన్ లో నాలుగు సినిమాలు మిస్ చేసుకున్న నాగార్జున గారు.1989 లో మణిరత్నం, నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన క్లాసిక్ మూవీ ” గీతాంజలి”, ఈ చిత్రానికి ముందు రెండు సినిమాలు, తరువాత రెండు సినిమాలు మణిరత్నం డైరెక్షన్ లో నాగార్జున గారికి ఆఫర్ వచ్చిన చేయలేక పోయారు. నాగార్జున గారు ఒక క్యారెక్టర్ ఒప్పుకోవాలంటే చాల ఆచి, తూచి అడుగు వేస్తారు. నాగార్జున గారి కెరీర్ ప్రారంభ దశలో కధల ఎంపికలో అంత పట్టులేని రోజుల్లో ఒక మంచి సినిమాను నాగార్జున గారు చేజార్చుకున్నారు అదే ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీ “మౌన రాగం”, ఈ మూవీ తరువాత మణిరత్నం కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా “ఘర్షణ” ఇందులో కూడా నాగార్జునకు వచ్చిన ఆఫర్ ను వదులుకున్నారు.
ఆ తరువాతి సంవత్సరం మణిరత్నం డైరెక్ట్ చేసిన ఏకైక తెలుగు చిత్రం “గీతాంజలి” లో నాగార్జున నటించారు. ఈ చిత్రం తరువాత అల్ టైం రికార్డు మూవీ “దళపతి” చిత్రంలో రజనీకాంత్ తో కలసి నటించవల్సిన క్యారెక్టర్ కూడా నాగార్జున వదులుకున్నారు, ఆ క్యారెక్టర్ లో మమూట్టి నటించారు. మహేష్ బాబు, నాగార్జున కాంబినేషన్ లో ఒక భారీ మల్టీ స్టారర్ ప్లాన్ చేసారు మణిరత్నం, కాని కొన్ని అనివార్య కారణాల వలన ఆ చిత్రం కూడా సెట్స్ మీదకు వెళ్లకుండానే ఆగి పోయింది. అదే కథను ఇప్పుడు “పొన్నియన్ సెల్వన్” అనే పేరు తో కార్తీ, శింబు కాంబినేషన్ లో నిర్మిస్తున్నారు మణిరత్నం. ఒక్కో సారి కొన్ని కంబినేషన్లు హిట్ అయినా వర్క్ అవుట్ కావు, కారణాలు ఎవరికి తెలియవు.