in

nag heroine Isha Koppikar opens up on facing casting couch!

సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పటినుండో జరుగుతున్నదే. అయితే ఇప్పటికే దీనిపై పలువురు హీరోయిన్లు బయటపెట్టారు. తాము కూడా క్యాస్టింగ్ కౌచ్ బారినపడ్డామంటూ పలువురు తమకు జరిగిన అన్యాయం గురించి బహిరంగంగా చెప్పారు. కానీ కొందరు మాత్రం ఇంకా చెప్పలేకపోతున్నారు. ఇటీవల ఓ బాలీవుడ్ నటి క్యాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి బయటపెట్టింది. ‘ఏక్‌ థా దిల్‌ ఏక్‌ థా ధడ్కన్‌’తో హీరోయిన్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఇషా కోపికర్‌. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ హిందీ సినిమాలు చేసి అక్కడే గుర్తింపు సాధించుకుంది. బాలీవుడ్‌లో కాస్త స్థిరపడిన తర్వాత ఇషా.. టాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టింది.

నాగార్జున హీరోగా నటించిన ‘చంద్రలేఖ’ సినిమాలో ఇషా పాత్రకు మంచి గుర్తింపు లభించింది. కొంతకాలం క్రితం నిఖిల్ హీరోగా వచ్చిన ‘కేశవ’ సినిమాలో ఓ కీ రోల్ చేసి తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది ఇషా. ప్రస్తుతం పూర్తిగా వెబ్ సిరీస్‌లకే పరిమితమైన ఇషా.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పుకొచ్చింది. ఇషా తమ ఫ్యామిలీ ఎక్కువగా డాక్టర్స్ వత్తినే ఎంచుకున్నారన్న విషయాన్ని తెలిపింది. అయితే తాను కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో కేవలం పాకెట్ మనీ కోసం మోడలింగ్‌లో అడుగుపెట్టిందట.

మోడలింగ్ ప్రారంభించిన కొన్నిరోజుల్లోనే ఇషాకు సినిమా అవకాశాలు కూడా రావడం మొదలయిందట. అయితే హీరోయిన్‌గా తన కెరీర్ ప్రారంభించిన కొత్తలో తనకు ఓ నిర్మాత ఫోన్ చేశారట. తమ అప్‌కమింగ్ సినిమాలో ఇషానే హీరోయిన్‌గా అనుకుంటున్నామని, హీరోకు తను బాగా నచ్చేసిందని చెప్పారట. అంతే కాకుండా హీరో తనను ఏకంతంగా కలవాలి అనుకున్నాడన్న విషయాన్ని కూడా ఇషా బయటపెట్టింది. అయితే ఇదే విషయాన్ని హీరోకు ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోగా.. నిజంగానే తనను ఏకాంతంగా రమ్మని చెప్పారట. వారి ప్రవర్తనతో బాధపడిన ఇషా.. తన టాలెంట్ చూసి సినిమా ఆఫర్లు వస్తేనే చేస్తానని గట్టిగా చెప్పేసిందట. దానికి ఆ నిర్మాతకు, హీరోకు కోపమొచ్చి తనను ఆ సినిమా నుండే తప్పించారని చెప్పింది ఇషా..

Prabhas reveals why he isn’t married yet!

surekha vani daughter supritha shocking comments on kissing scenes!