ఓఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె స్టార్ స్టేటస్, సినిమాలు, యాడ్స్, ఆరోగ్యం.. వంటి పలు అంశాలపై తన అభిప్రాయాలు చెప్పుకొచ్చారు. వాణిజ్య ప్రకటనలపై ఆమె స్పందిస్తూ తన స్టార్ స్టేటస్ చూసి వస్తున్న యాడ్స్ చేయట్లేదని.. ఏడాదిలో 15 ఆఫర్స్ తిరస్కరించినట్టు చెప్పారు. ‘20ఏళ్ల వయసులోనే సినిమాల్లోకి వచ్చి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ అయ్యాను. ఎన్ని సినిమాలు ఎన్ని యాడ్స్ చేస్తున్నామనే దానిపైనే సక్సెస్ నిర్ణయించే రోజులవి.
నేను కూడా వచ్చిన యాడ్స్ చేసి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఉన్నా. అందుకు ఎంతో సంతోషం కలిగేది కూడా. ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది’..‘కానీ.. ఇప్పుడు చాలా తెలుసుకున్నా. గతంలా కాకుండా ఉత్పత్తుల గురించి పూర్తిగా తెలుసుకుంటున్నా. నాకు తెలిసిన ముగ్గురు వైద్యులతో వాటితో సమాజానికి ఎటువంటి హానీ జరగదని నిర్ణయించుకున్నాకే చేస్తున్నా. గతంలో వచ్చిన యాడ్స్ వచ్చినట్టు చేసినందుకు క్షమాపణలు చెప్తున్నా’నని అన్నారు సమంత..!!