డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్
నాగ్ అశ్విన్ ఓ సినిమా ట్రైలర్ చూసి డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడంట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపాడు. తాజాగా ఆయన ఓ కాలేజీ స్టూడెంట్స్ ముచ్చటించారు. ఈ సందర్భంగా అక్కడ ‘కొత్త కథలు రాయడం చాలా కష్టం కదా’ అని ఓ ప్రశ్న ఎదురైంది. దీనికి నాగ్ అశ్విన్ స్పందిస్తూ..
హాలీవుడ్ సినిమా ట్రైలర్ చూసి నాగ్ అశ్విన్ కు మైండ్ బ్లాంక్
కొత్త కథలు రాయడం అనేది ఎప్పుడూ ఓ టాస్క్ లాంటిదే అంటూ స్పందించారు. ‘కొత్త కథలు రాయడం అంటే చాలా ఆలోచించాలి. ఎందుకంటే మనం రాసిన కాన్సెప్టుతోనే కొన్ని రోజులకు సినిమాలు లేదా ట్రైలర్లు కూడా వస్తాయి. మనకు వచ్చిన ఐడియాలే వేరే వారికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. నేను 2008లో కలలు, జ్ఞాపకాల నేపథ్యంలో ఓ కథ రాసుకున్నాను. కానీ అదే కాన్సెప్టుతో హాలీవుడ్ లో ఇన్ సెప్షన్ అనే మూవీ ట్రైలర్ వచ్చింది. దాన్ని చూసి వారం రోజుల పాటు డిప్రెషన్ లోకి వెళ్లిపోయా.. అయినా సరే కొత్త కథలు రాస్తూనే ఉంటా’ అంటూ తెలిపారు..!!