in

nabha natesh’s 2 pan indian movies to hit theaters in Summer!

భా నటేష్‌కు ఈ వేసవి ప్రత్యేకంగా ఉండబోతోంది. ఆమె నటించిన రెండు భారీ పాన్ ఇండియా చిత్రాలు స్వయంభు, నాగబంధం ఒకే సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. భిన్నమైన కథా నేపథ్యాలు, గ్రాండ్ మేకింగ్‌తో రూపొందిన ఈ రెండు సినిమాలు నభా కెరీర్‌లో కీలక మైలురాళ్లుగా మారనున్నాయనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఒకేసారి రెండు భారీ ప్రాజెక్టులతో థియేటర్లలో కనిపించడం నభా నటేష్‌కు అరుదైన అవకాశంగా మారింది..

నాగబంధం చిత్రంలో నభా నటేష్ పార్వతి అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనుండగా, స్వయంభు చిత్రంలో సుందరవల్లి అనే యువరాణి పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. రెండు సినిమాల్లోనూ ఆమె పాత్రలు కథకు కీలకంగా ఉండటం విశేషం. సంప్రదాయ టచ్ ఉన్న పాత్రతో పాటు, గ్రాండ్ విజువల్ ప్రపంచంలో సాగే పాత్రలో కనిపించడం ద్వారా తన నటనా పరిధిని విస్తరించేందుకు నభా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు చిత్రాల్లో ఆమె లుక్, క్యారెక్టర్ డిజైన్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి..!!

Kriti Sanon and Rashmika to play a lesbian couple in Cocktail 2?

Anupama Parameswaran Reveals Traumatic Food Incident!