in

nabha natesh keeps all hopes on her re entry film!

భా నటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వజ్రకాయ మూవీతో సినీరంగ ప్రవేశం చేసింది కన్నడ బ్యూటీ. నన్ను దోచుకుందువటే మూవీతో టాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇచ్చింది. సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన చిత్రం బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధించింది. ఆ తర్వాత పూరీ దర్శకత్వంలో ఇస్మార్ట్‌ శంకర్‌ మూవీలో నటించిన నభాకు గుర్తింపే వచ్చింది. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలతో దూసుకెళ్లింది.

తెలుగులో 2021లో మాస్ట్రో మూవీలో కనిపించిన బ్యూటీ ఆ తర్వాత హఠాత్తుగా తెరపై నుంచి కనుమరుగైంది. అయితే, 2022లో రోడ్డు ప్రమాదంలో గాయపడింది. దాంతో దాదాపు రెండేళ్ల పాటు సినిమాలకు దూరం కావాల్సి వచ్చింది. మళ్లీ ఈ ఏడాది డార్లింగ్‌ మూవీతో మళ్లీ తెరంగేట్రం చేసింది. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద బోల్తాకొట్టింది. ప్రస్తుతం తెలుగులో నిఖిల్‌ సిద్ధార్థ్‌ హీరోగా వస్తున్న ‘స్వయంభూ’ మూవీలో ఛాన్స్‌ కొట్టేసింది. ఈ మూవీతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నది..!!

balayya planning sequels with Prasanth Varma!

Devara!