NTR సంతానంలో హరికృష్ణ గారికి యెన్.టి.ఆర్. దగ్గర కొంచెం చనువు ఉండేది. సినీ నిర్మాణం లో అయిన, రాజకీయ ప్రవేశం సందర్భంలో అయిన హరికృష్ణ యెన్.టి.ఆర్. ని వెన్నంటి ఉండేవారు అయన ఆజ్ఞలను తూ. చ తప్పకుండ అమలుచేసేవారు. రాజకీయ ప్రేవేశం చేసినప్పుడు నిర్విరామంగా చైతన్య రధం నడిపి యెన్.టి.ఆర్. గారికి తగిన బిడ్డ అనిపించుకున్నారు హరికృష్ణ. అటువంటి హరికృష్ణ గారికి యెన్.టి.ఆర్. కి మధ్య రెండేళ్లు మాటలు లేకుండా పోయాయి ఒక విషయం లో.సొంతగా సినిమా హాల్ నిర్మించటానికి పెట్టుబడి పెట్టమని అడిగారు హరికృష్ణ..
ఇటువంటి విషయాలలో యెన్.టి.ఆర్. తన చిరకాల మిత్రుడు ఏ.యెన్.ఆర్. సలహాలు తీసుకొనే వారు. ఏ.యెన్.ఆర్. సినిమా హాల్ వద్దు రిస్క్ ఉంటుంది, స్టూడియో పెట్టించండి మంచి బిజినెస్ అని సలహా ఇచ్చారట. స్టూడియో పెట్టడం ఇష్టం లేని హరికృష్ణ గారు తండ్రి తో మాట్లాడటం మానేశారట, ఆయనేమి తక్కువ తిన్నారా నేను నీ బాబుని అన్నట్లు గ యెన్.టి.ఆర్. కూడా మౌనంగా ఉండి పోయారట. చివరకు హరికృష్ణ గారు స్టూడియో పెట్టడానికి అంగకరించి, హైదరాబాద్ లో రామకృష్ణ సినీ స్టూడియోస్ స్థాపించారు..