తెలుగు చిత్రసీమలో దిగ్గజ నటులయిన ఎస్.వి.ఆర్. యెన్.టి.ఆర్. ఒకరి ని ఒకరు బావగారు అని పిలుచుకున్న, ఇద్దరి మధ్య తీవ్రమయిన నటనపరమయిన పోటీ ఉండేది. ఈ పోటీ ఒక్కొక్కసారి దర్సక, నిర్మాతల ప్రాణం మీదకు వచ్చేది.” పాండవ వనవాసం” చిత్రంలో భీముడి పాత్రలో ఉన్న యెన్.టి.ఆర్. ” ధారుణి రాజ్య ” అంటూ పెద్ద పద్యం, డైలాగులులతో దుర్యధనుడి కి వార్నింగ్ ఇస్తారు, ఆ ముందు రోజు రిహార్సల్ కు డుమ్మా కొట్టిన ఎస్.వి.ఆర్. గారు స్క్రిప్ట్ ఉన్న డైలాగు చెప్పకుండా సందర్భోచితంగా” ఛీ బానిస, బానిసలకు ఇంత అహంభావమ “అంటూ తన సొంత డైలాగు చెప్పారు, వెంటనే యెన్.టి.ఆర్. వన్ మోర్ అన్నారట, ఎస్.విఆర్. నోమోర్ అన్నారట.
ఇక అంతే సెట్ లో చెరొక వైపు కుర్చీ వేసుకొని కూర్చున్నారు, షూటింగ్ బ్రేక్, స్క్రిప్టులో లేని డైలాగ్ చెప్పటం ఏమిటి అని యెన్.టి.ఆర్., స్క్రిప్ట్ లో లేక పోయిన సందర్భోచితంగా ఉంది కదా అభ్యంతరం ఏమిటి అంటూ ఎస్.వి.ఆర్. భీష్మించుకుని కూర్చున్నారు. చివరకు, దర్శకుడు, నిర్మాత రంగంలోకి దిగి యిద్దరిని సముదాయించి షూటింగ్ ఇలా అర్ధాంతరంగా ఆగిపోతే తమకెంత నష్టమో తెలియచేసుకొని, బతిమాలి తిరిగి షూటింగ్ స్టార్ట్ చేశారట. సినిమా రిలీజ్ అయిన తరువాత ఎస్.వి.ఆర్. డైలాగు కి థియేటర్లు చప్పట్లోతో మారుమోగిపోయాయి.