అసలు పేరు” కమల కుమారి”, సినీ నామధేయం “జయంతి”, బాల్యం లో యెన్.టి. రామ రావు గారి ఒడిలో కూర్చొని కబుర్లు చెప్పిన కమల కుమారి, ఆ తరువాత జయంతి గ యెన్.టి.ఆర్. సరసన హీరోయిన్ గ నటించారు. చిన్న తనం లో మద్రాసు లో డాన్స్ నేర్చుకుంటున్న కమల కుమారి, తన అభిమాన నటుడు యెన్.టి.ఆర్. గారిని చూడటానికి స్టూడియో కి వెళ్లారట, ముద్దుగా ఉన్న పాపను ఆప్యాయంగా ఒడిలో కుర్చోబెట్టుకొని, చక్కగా ఉన్నావు, పెద్దయ్యాక నాతో హీరోయిన్ గ నటిస్తావా అని అడిగారట యెన్.టి.ఆర్. ఓ…. నటిస్తాను అని సంబరంగా చెప్పిందట ఆ పాపా.
ఏ తధాస్తు దేవతలు తధాస్తు అన్నారో గానీ, కొంత కాలానికి కమల కుమారి కాస్త జయంతి గ మారి, యెన్.టి.ఆర్. సరసన జగదేక వీరుని కథ చిత్రం లో హీరోయిన్ గ నటించారు, ఆ తరువాత కొండవీటి సింహం, జస్టిస్ చౌదరీ వంటి చిత్రాలలో యెన్.టి.ఆర్. తో పోటీ పడి నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. దక్షిణాది భాషలలోనే కాకుండా హిందీ, మరాఠీ చిత్రాలలో కూడా నటించి ప్రేక్షకులను రంజింప చేసారు. కన్నడ సినీ పరిశ్రమ ఆమెను ” అభినయ శారదే ” అనే బిరుదు తో సత్కరించింది.