NTR తో కలసి నటించాలని అప్పటి తరం నటులు అందరు ఉవ్విళ్ళూరేవారు, ఆలా అవకాశం వచ్చి నటించిన వారు ఎంతో హ్యాపీ గ ఫీల్ అయితే, అవకాశం రాని నటులు ఎంతో నిరాశ చెందేవారు. మూడవ తరం హీరోలు అయిన చిరంజీవి, బాలయ్య యెన్.టి.ఆర్. తో కలసి నటించారు, కానీ నాగార్జున, వెంకటేష్ లకు మాత్రం ఆ అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. యెన్.టి.ఆర్. రాజకీయాలలోకి వచ్చిన కొత్తలో ఏ.యెన్.ఆర్. తో కొంత మనస్పర్థలు వచ్చాయి కొంత కాలం వీరిద్దరి మధ్య మాటలు లేవు. కొన్ని రోజుల తరువాత ఆ మనస్పర్థలకు ఫుల్స్టాప్ పెట్టాలని యెన్.టి.ఆర్. అక్కినేని గారిని, కుటుంబ సమేతంగా తన ఇంటికి విందుకు ఆహ్వానించారు, ఆ విందుకు అక్కినేని వెళ్ళటం కుదర లేదు, మిగతా కుటుంబ సభ్యులు అందరు వెళ్లి కల్సిన సందర్భం లో నాగార్జున తో కలసి ఒక చిత్రం చేయాలని ఉంది అని చెప్పారు యెన్.టి.ఆర్. 1989 లో యెన్.టి.ఆర్.ఎన్నికలలో ఓడిపోయాక రాఘవేంద్ర రావు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా చేయాలనీ అనుకున్నారు.
ఆ సందర్భం లో యెన్.టి.ఆర్. సినిమాలకు దూరంగా ఉండటం వలన సాధ్యం కాలేదు, ఆ తరువాతి కాలంలో యెన్.టి.ఆర్. సినిమాలు చేసిన, రాఘవేంద్ర రావు ఎంత ప్రయత్నించినా వీరిద్దరి కాంబినేషన్ సెట్ కాలేదు, ఆ విధంగా నాగార్జున యెన్.టి.ఆర్. తో నటించే అవకాశం మిస్ అయ్యారు..ఇక వెంకటెష్ తో కూడా కలసి యెన్.టి.ఆర్. నటించాలని అనుకున్నారు, రామ నాయుడు గారి తో ఆయనకు ఉన్న అనుబంధం అందరికి తెలిసిందే. బాలయ్య బాబు తన వందో సినిమాగా నటించిన “గౌతమీపుత్ర శాతకర్ణి” సినిమానే యెన్.టి.ఆర్. గతంలో తీయాలనుకున్నారు, యెన్.టి.ఆర్. శాతకర్ణి పాత్ర, వెంకటేష్ ను పులోమావి పాత్రకు అనుకున్నారు.ఆ ప్రపోసల్ కు వంకటేష్ కూడా ఒకే చెప్పేసారు. కానీ యెన్.టి.ఆర్. 1994 ఎలక్షన్ లో బిజీ అవటంతో ఆ చిత్రం సెట్స్ మీదకు వేళ్ళ లేదు, ఆ విధంగా వెంకటేష్ యెన్.టి.ఆర్. తో నటించే అవకాశం మిస్ అయ్యారు.