మెగా స్టార్ చిరంజీవి నటించిన ” ముఠా మేస్త్రి” టైటిల్ వెనుక ఉన్న ఇంటరెస్టింగ్ స్టోరీ మీకు తెలుసా? ఈ చిత్రానికి మొదట ముఠా మేస్త్రి అనుకోలేదు. ఈ చిత్ర ప్రారంభానికి ముందు ప్రెస్ మీట్ పెట్టి ఈ చిత్రంలో చిరంజీవి గారు ఒక వెజిటల్ మార్కెట్ లో ముఠా కూలీగా ఉండి, తన నిజాయితీ అయిన ప్రవర్తన వలన ముఖ్య మంత్రి చేత రాజకీయాలలో కి ఆహ్వానింప బడతారు అని సినిమా కధ గురుంచి క్లుప్తంగా చెప్పి , ఇంకా చిత్రానికి టైటిల్ డిసైడ్ చేయలేదు, చేసాక తెలియ చేస్తాము అని తెలియ చేసారు. మరుసటి రోజు న్యూస్ పేపర్లో ముఠా మేస్త్రిగా నటిస్తున్న చిరంజీవి అంటూ ఆర్టికల్ వచ్చింది, అది చూసిన దర్శకుడు కోదండ రామి రెడ్డి, ఆ ఆర్టికల్ ను చిరంజీవి గారికి చూపించారు. ముఠా మేస్త్రి అన్న ఆ పదం డైరెక్టర్ కి, చిరంజీవి గారికి చాల బాగా నచ్చేసింది..
అంతే మరో ఆలోచన లేకుండా ఆ చిత్రానికి “ముఠా మేస్త్రి” అని టైటిల్ అనౌన్స్ చేసారు. మరుసటి రోజు చిరంజీవి గారి చిత్రం టైటిల్” ముఠా మేస్త్రి ” అని అన్ని వార్త పత్రికల్లో పెద్ద అక్షరాలతో వచ్చింది. చిరంజీవి గారికి ఉన్న మాస్ ఇమేజ్ కి సరి అయిన టైటిల్ అవటం తో ఫాన్స్ టైటిల్ చూసి, సినిమా సూపర్ హిట్ అయినంత హడావిడి చేసేసారు. సినిమా రిలీజ్ అయిన తరువాత ప్రేక్షకులు సూపర్ హిట్ చేసారు, టైటిల్ పెట్టిన వేళా విశేషం అటువంటిది మరి. ఇక్కడ ఇంకొక ఆశ్ఛర్యకరమయిన విషయం ఏమిటంటే చిరంజీవి, కోదండ రామి రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన ఆఖరి చిత్రం అదే కావటం.