తెలుగు చిత్రసీమలో ఆర్ నారాయణమూర్తి ది ప్రత్యేక శైలి. ఆయన నటనే, సినిమాలు అన్నీ కూడా ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. నిర్మాత, దర్శకుడు, హీరోగా ఆర్ నారాయణ మూర్తి కెరీర్‌లో ఎన్నో మరుపురాని చిత్రాలున్నాయి. అయితే ఆర్ నారాయణ మూర్తి తన జీవితాన్ని ఒంటరిగానే ఈదుతున్నాడు. దీనికి వెనుక పెద్ద కథే ఉందట. యుక్త వయస్సులో ఎదురైన ఘటనతో మొత్తానికి ఇలా ఉండిపోవాల్సి వచ్చిందట..కాలేజ్ సమయంలో ఆర్ నారాయణ మూర్తి ఓ ఉద్యమకారుడు. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ, విశాఖ ఉక్కు ఇలా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నాడు. అలా కాలేజ్ ఏజ్‌లో ఓ అమ్మాయిపై ఇష్టం ఏర్పడిందట. అదే విషయాన్ని పేరెంట్స్‌కు చెబితే ఒప్పుకోలేదట.
కులాలు వేరే అయ్యే సరికి ఇంట్లో వాళ్లు అంగీకరించలేదట. ఇంట్లో వాళ్లను కాదనుకుని పెళ్లి చేసుకోలేక అప్పటి నుంచి అలా ఒంటరిగానే ఉండిపోయాడట..కానీ జీవితంలో ఓ తోడు అనేది ఉండాలని, తన అనుభవంతో చెబుతున్నానంటూ ఆర్ నారాయణ మూర్తి యువతకు సందేశాన్ని ఇచ్చాడు. పెళ్లి, పిల్లలు, మనవళ్లు ఇలా ఉంటేనే జీవితం సంపూర్ణమవుతుందని, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరిగితే బాగుంటుందని యువతకు మూర్తన్న మెసెజ్ ఇచ్చాడు. అలా మొత్తానికి మూర్తన్న ఇప్పటికీ సోలోగానే బతుకు బండిని లాగుతున్నాడు.