గత 16ఏళ్లుగా అందాల నటి శిల్పా శెట్టిని వంటాడుతోన్న కిస్సింగ్ కాంట్రావర్శీకి ముంబై కోర్డు ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పెట్టింది. 2007లో ఎయిడ్స్ అవగాహాన సదస్సులో హాలీవుడ్ నటుడు రిచర్డ్ గెరే, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న శిల్పాశెట్టిని ఘాటుగా ముద్దాడిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ అంశంపై తారాస్థాయిలో విమర్శలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే సభ్యసమాజంలో అసభ్యంగా ప్రవర్తించారు అంటూ శిల్పాశెట్టిపై కేసు నమోదు అయింది. ఈ కేసు నుంచి తనకు ఊరట ప్రసాదించాల్సిందిగా శిల్పా శెట్టి సైతం ఎన్నోసార్లు కోర్టుకు మొరపెట్టుకుంది..
ఎట్టకేలకు ఆమెకు కేసు నుంచి విముక్తిని ప్రసాదిస్తూ ముంబై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఘటనలో శిల్ఫా శెట్టి ప్రమేయం ఏమాత్రం లేదని కోర్టు స్పష్టం చేసింది. బుస్సులో ఆకతాయి వల్ల ఇబ్బంది పడిన ఘటనలో అమ్మాయి దోషం ఉందని ఎలా చెప్పలేమో ఇక్కడా అంతేనని ముంబై కోర్టు వెల్లడించింది. ఇక్కడ ఆమె స్వయంగా ముద్దుపెట్టలేదని, ఆమెను బలవంతంగా ముద్దాడారని, కాబట్టి, ఈ ఘటనలో ఆమె ప్రమేయాన్ని తప్పుబట్టలేమని తేల్చేసింది..!!