తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి నుంచి రచయితల పరిస్థితి ” పేరు గొప్ప ఊరు దిబ్బ ” అంటారు, వారికీ కీర్తి కి కొదువ లేదు, కానీ వారికీ సరి అయిన రెమ్యూనరేషన్ ఇవ్వకుండ సతాయించే వారు నిర్మాతలు. ఒకరు ఇద్దరు అని కాదు దాదాపుగా అందరి పరిస్థితి అదే. పరుచూరి బ్రదర్స్ రాక తో పరిస్థితి కొంత మారింది, వారు రెమ్యూనరేషన్ విషయంలోనే కాదు, వారు రాసిన కథ, సంభాషణలు డైరెక్టర్లు తమకు తెలియచేయకుండా మారిస్తే ఒప్పుకొనేవారు కాదు. కృష్ణ గారు నటించిన” సిరిపురం మొనగాడు” చిత్రానికి కే.ఎస్.ర్. దాస్ గారు డైరెక్టర్, పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్, షూటింగ్ టైం లో డైలాగ్స్ మార్చేశారు, దాస్ గారికి అదొక అలవాటు.
సినిమా రిలీజ్ అయ్యాక విషయం తెలిసిన పరుచూరి బ్రదర్స్ భాధ పడ్డారు. అదే దాస్ గారి డైరెక్షన్ లో “ముద్దాయి “అనే సినిమా కు డైలాగ్స్ వ్రాయమని అడగగా, పరుచూరి బ్రదర్స్ మేము వ్రాయము అని చెప్పేశారట, అదేమిటి అని అడిగిన నిర్మాతకు ” దాస్ గారు మేము వ్రాసిన డైలాగ్స్ కాకుండా ఆయన సొంత డైలాగులు పెట్టేస్తారు”,అంత మాత్రానికి మేము వ్రాయటం ఎందుకు అనేసారట. అది తెలిసిన దాస్ గారు” బ్రదర్స్ మీరు వ్రాసిన ఒక్క డైలాగు కూడా మార్చాను” అని గట్టిగ చెప్పిన తరువాత ముద్దాయి చిత్రానికి డైలాగ్స్ వ్రాసారు. అది పరుచూరి బ్రదర్స్ అంటే!