రామ్ చరణ్ సినిమాలో MS ధోనీ కనిపించబోతున్నాడు. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ స్పోర్ట్స్‌మన్‌గా కనిపించనున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో కీలక పాత్రలో స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోని కనిపించబోతున్నాడు. రామ్ చరణ్‌కు కోచ్‌గా ధోనీ నటిస్తున్నట్లు సమాచారం అందుతోంది..
అయితే.. దీనిపై ఇప్పటికే చర్చలు జరిగినట్లు చెబుతున్నారు. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా రామ్ చరణ్ కెరీర్లో ఇది 16వ సినిమా కాగా ఈ చిత్రం కోసం స్టార్ నటులు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, కన్నడ నుంచి శివ రాజ్ కుమార్ అంతెందుకు ఆస్కార్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ లాంటి వారినే ఎగ్జైట్ చేసి తన సినిమాకి వర్క్ చేసేలా చేసుకున్నాడు బుచ్చిబాబు..!!