in

Mrunal Thakur to do a special song in Ram Charan’s ‘Peddi’?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ సినిమాపై ఓ ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలోని ఓ ప్రత్యేక గీతంలో ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్ కనిపించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ స్పెషల్ సాంగ్‌లో మృణాల్‌తో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఉంటారని కొందరు అంటుండగా, కేవలం ఆమె మాత్రమే ఉంటుందని మరికొన్ని వార్తలు వినిపిస్తున్నాయి..

అయితే, ఈ వార్తలపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం ‘పెద్ది’ చివరి దశ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులతో శరవేగంగా ముందుకు సాగుతోంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు..!!

Nora Fatehi Reacts To Vulgar Song Controversy!

Anushka Sharma in talks for Allu Arjun AA22 Atlee film Telugu debut

Anushka Sharma joins Allu Arjun Atlee film AA22?