సీతారామం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన నటి మృణాల్ ఠాకూర్, తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న తీవ్రమైన కష్టాల గురించి సంచలన విషయాలు వెల్లడించారు. ఒకప్పుడు అవకాశాలు లేక తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడ్డానని, ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి..
సినీ రంగంలోకి అడుగుపెట్టిన కొత్తలో అవకాశాల కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డానని మృణాల్ గుర్తుచేసుకున్నారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక ఒకానొక దశలో లోకల్ ట్రైన్ నుంచి దూకి ప్రాణాలు తీసుకోవాలని కూడా అనుకున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. “అలాంటి తీవ్రమైన ఆలోచన వచ్చినప్పుడు ఒక్కసారిగా నా తల్లిదండ్రుల ముఖాలు గుర్తొచ్చాయి. వారిని తలుచుకుని ఆ నిర్ణయాన్ని విరమించుకున్నాను” అని మృణాల్ భావోద్వేగంగా తెలిపారు..!!