in

mrunal thakur signed 2 movies with raghava lawrence?

సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది మృణాల్ ఠాకూర్. ఆ చిత్రంలో సీత పాత్రలో తనను తప్ప ఇంకొకరిని ఊహించుకోలేని పెర్ఫార్మన్స్ ఇచ్చిందామె. అందం, అభినయం రెండింటితోను కట్టిపడేసి తెలుగు ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేసింది మృణాల్. ఆ సినిమా తర్వాత కూడా ఆమెకు తెలుగులో మంచి మంచి అవకాశాలే వస్తున్నాయి. ఇప్పటికే హాయ్ నాన్నతో మరో విజయాన్ని సొంతం చేసుకుంది..

మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో కూడా ఆమెనే కథానాయకగా అనుకుంటున్నాట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగులో ఇలా క్రేజీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న మృణాల్..తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. ఆమె నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ సరసన సినిమా చేయబోతుందట. అది కూడా ఒకటి కాదు రెండు సినిమాల్లోనట. ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న అయలాన్ సినిమాను రూపొందించిన రవికుమార్ దర్శకత్వంలో రాఘవ లారెన్స్ ఒక సినిమా చేయబోతున్నాడు..!!

Chiranjeevi Cheif Guest for hanuman Pre Release Event?

happy birthday SAROJA DEVI!