మృణాల్ హీరో ఇంకా నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2 సినిమా ప్రీమియర్ సందర్భంగా ధనుష్ కూడా హాజరై సందడి చేశారు. ఇలా వరుస సంఘటనలు వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే వార్తలకు బలం చేకూర్చాయి. ఇక ఇటీవల కాలంలో మృణాల్ ఠాకూర్ ధనుష్ సిస్టర్స్ తో కూడా క్లోజ్ గా కనిపించిన నేపథ్యంలోనే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని త్వరలోనే వీరి రిలేషన్ గురించి బయటపెట్టి పెళ్లి కూడా చేసుకోబోతారు అంటూ వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తలు గురించి ధనుష్ ఎక్కడ స్పందించలేదు..
కానీ తాజాగా మృణాల్ ఠాకూర్ స్పందిస్తూ ఈ వార్తలను ఖండించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమెకు ఇదే ప్రశ్నలు ఎదురవడంతో.. ధనుష్ తో రిలేషన్ లో ఉన్నానంటూ వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని, మేమిద్దరం చాలా మంచి స్నేహితులమని క్లారిటీ ఇచ్చారు. అయితే ధనుష్ సన్ ఆఫ్ సర్దార్ 2 ప్రీమియర్ కి రావడం తన పుట్టిన రోజు వేడుకలలో పాల్గొనడం వంటివన్నీ కూడా సాధారణంగానే జరిగాయని మేమిద్దరం కలిసి తదుపరి సినిమాలో నటించబోతున్న నేపథ్యంలోనే ఇలాంటి సంఘటనలు జరిగాయని చెప్పుకువచ్చారు..!!