in

mrunal thakur rejected several films due to lip-lock scenes!

క ఇంటర్వ్యూలో మృణాల్ మాట్లాడుతూ, తన కెరీర్ ప్రారంభ రోజుల్లో ఒక సినిమాలో నటించినప్పుడు, అందులోని లిప్‌లాక్ సన్నివేశాన్ని చూసి తన తల్లిదండ్రులు తీవ్రంగా స్పందించారని చెప్పారు. కుటుంబ గౌరవం, వారి మనోభావాలను దృష్టిలో ఉంచుకుని, అటువంటి రొమాంటిక్ సన్నివేశాలకు దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఫలితంగా, మంచి కథలు ఉన్నప్పటికీ, కేవలం లిప్‌లాక్ సీన్స్ ఉన్నాయని తెలియగానే ఎన్నో క్రేజీ ప్రాజెక్టులను ఆమె సున్నితంగా తిరస్కరించాల్సి వచ్చింది..

ఈ నిర్ణయం వల్ల తాను కోరుకున్న స్థాయికి చేరుకోవడంలో ఆలస్యం జరిగిందని, చాలా మంచి అవకాశాలు చేజారిపోయాయని మృణాల్ ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా అంటేనే ఒక కళ అని, అందులో పాత్రకు అనుగుణంగా నటించడం ఒక భాగమని నేను మా తల్లిదండ్రులకు అర్థమయ్యేలా చెప్పాను. మొదట్లో వారు ఇబ్బంది పడినా, చివరికి నా కెరీర్ పట్ల వారికి ఉన్న నమ్మకంతో ఒప్పుకున్నారు అని ఆమె వివరించారు. కాలక్రమంలో తన దృక్పథం మారిందని, సినిమా కథకు అవసరమైతే రొమాంటిక్ లేదా లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించడానికి తాను సిద్ధమేనని మృణాల్ స్పష్టం చేశారు..!!

17 years for ‘jagadam’!

Lavanya Tripathi recalls her bad days working with a tamil director!