in

Mrunal Thakur reacts to dating rumours, calls it ‘free PR’!

ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్ తనపై వస్తున్న డేటింగ్ రూమర్లకు నవ్వుతూ సమాధానమిచ్చారు. నటుడు ధనుష్‌తో ఆమె రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ కొంతకాలంగా జరుగుతున్న ప్రచారంపై ఆసక్తికరంగా స్పందించారు. ఇలాంటి పుకార్లను తాను ఉచిత ప్రచారంగా (ఫ్రీ పీఆర్) భావిస్తానంటూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు..

మృణాల్ తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో ఒక వీడియోను షేర్ చేశారు. అందులో ఆమె తలకు నూనె పెట్టిస్తుండగా గట్టిగా నవ్వుతూ కనిపించారు. ఈ వీడియోకు, “వాళ్ళు మాట్లాడుకుంటారు..మనం నవ్వుకుంటాం. రూమర్లు అంటే ఫ్రీ పీఆర్. నాకు ఉచితంగా వచ్చేవి ఇష్టం” అంటూ ఫన్నీ క్యాప్షన్ జోడించారు. ఆమె ఏ పుకారు గురించి మాట్లాడుతున్నారో ప్రత్యేకంగా చెప్పకపోయినా, ఇది ధనుష్‌తో తనపై వస్తున్న వదంతుల గురించేనని నెటిజన్లు భావిస్తున్నారు..!!

f cube ‘Rukmini Vasanth’!