
పాన్ ఇండియా స్థాయిలో ఆసక్తి రేకెత్తిస్తున్న డెకాయిట్ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న వేళ, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తన పాత్ర, షూటింగ్ అనుభవాలు, యాక్షన్ సన్నివేశాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అడివి శేష్ హీరోగా నటిస్తున్న ఈ యాక్షన్-రొమాంటిక్ థ్రిల్లర్‌లో మృణాల్ “సరస్వతి” అనే కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏప్రిల్ 10న థియేటర్లలోకి రానున్న ఈ సినిమా ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలతో మంచి అంచనాలు పెంచుకుంది..
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మృణాల్ ఠాకూర్, డెకాయిట్లో తాను పోషించిన “సరస్వతి” పాత్ర తన కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోతుందని చెప్పారు. “ఇది చాలా కాంప్లెక్స్, డిఫికల్ట్ క్యారెక్టర్. కానీ మేకర్స్ ఆ పాత్రను యాక్టర్‌కు సులభంగా అర్థమయ్యేలా చాలా బాగా డిజైన్ చేశారు. ఒక నటిగా ఛాలెంజింగ్ పాత్రలు చేయడం ఎప్పుడూ నాకు ఇష్టం. సరస్వతి పాత్ర అలాంటి అనుభూతినే ఇచ్చింది” అని తెలిపారు. ఈ సినిమాలో తన పాత్రను ఎంతో ఎంజాయ్ చేస్తూ చేశానని మృణాల్ చెప్పారు..!!
