in

Mrunal Thakur is in talks for a special song in peddi?

సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి మృణాల్ ఠాకూర్, ఇప్పుడు ఓ భారీ చిత్రంలో ప్రత్యేక గీతంలో అలరించనున్నారనే వార్తలు ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’లో ఆమె ఓ ఐటెం సాంగ్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ పాట కోసం చిత్ర నిర్మాతలు ఇప్పటికే మృణాల్‌ను సంప్రదించారని, ఇది ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో ఆమె వెంటనే అంగీకరించినట్లు సమాచారం..

ఈ ప్రత్యేక గీతాన్ని భారీ హంగులతో, అద్భుతమైన సెట్‌లో చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాట కోసం సంగీత ద‌ర్శ‌కుడు ఏ.ఆర్. రెహమాన్ ఇప్పటికే ఓ హుషారైన ట్యూన్‌ను సిద్ధం చేశారని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇటీవలి కాలంలో అగ్ర కథానాయికలు ప్రత్యేక గీతాల్లో నటించడం ఒక ట్రెండ్‌గా మారింది. తక్కువ రోజుల కాల్షీట్లకు భారీ పారితోషికం లభించడంతో పాటు, యువతలో ఇలాంటి పాటలకు ఉన్న క్రేజ్ దృష్ట్యా స్టార్ హీరోయిన్లు ఐటెం సాంగ్స్‌కు ఆసక్తి చూపుతున్నారు..!!

Cheekatilo!

rrr actress Olivia Morris on board for ntr neel film?