కీర్తి రెడ్డి సుమంత్ నుంచి విడిపోయి అనంతరం వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో విదేశాలలో స్థిరపడి ఉన్నారు కానీ సుమంత్ మాత్రం ఇప్పటివరకు రెండో పెళ్లి చేసుకోలేదు. దీంతో ఈయన రెండో పెళ్లి గురించి తరచూ వార్తలు వినపడుతూనే ఉన్నాయి. సుమంత్ పెళ్లికి సంబంధించి గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈయన ఒక హీరోయిన్ తో ప్రేమలో పడ్డారని పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.
మరి సుమంత్ పెళ్లాడబోతున్న హీరోయిన్ ఎవరు అనే విషయానికి వస్తే ఆమె మరెవరో కాదు సీతారామం బ్యూటీ మృణాల్ ఠాగూర్. వీరిద్దరూ కలిసి సీతారామం సినిమాలో నటించారు. అయితే ఇందులో సుమంత్ ఒక నెగిటివ్ పాత్రలో నటించారు. ఈ సినిమా తర్వాత వీరిద్దరి పరిచయం పెరిగిపోయిందని అది కాస్త ప్రేమగా మారిందని తెలుస్తుంది. ఇలా ప్రేమలో ఉన్నటువంటి వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరికి సంబంధించి ఒక ఫోటో వైరల్ గా మారింది ఈ ఫోటోలో ఈ జంట చాలా చనువుగా కనిపించడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోవటం నిజమేనంటూ అభిమానులు భావిస్తున్నారు..!!